మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక గుండెవిరిగే ఘటన జరిగింది. 9వ తరగతి విద్యార్థిని సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉంచుకుని మాట్లాడుతూ ఉండగా, ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పేలిపోయింది. ఈ పేలుడులో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వివరాల ప్రకారం, బాలిక ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి, వారితో మాట్లాడుతోంది. అర్ధనిద్రలో ఉన్న సమయంలో, అలా మాట్లాడుతుండగా సెల్ ఫోన్ వేడెక్కి పేలిపోయింది. ఈ పేలుడుతో బాలిక తీవ్ర గాయాల పాలైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనతో బాలిక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ పేలిన కారణాలు ఇంకా తెలియలేదు, కానీ బ్యాటరీలో ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మరియు డిపార్ట్‌మెంట్ అనేక కోణాల్లో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa