తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం భక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించేందుకు టీటీడీ నిర్ణయించింది.
ఈ నిర్ణయం ప్రకారం, మే 15వ తేదీ నుండి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల కేటాయింపు తిరిగి ప్రారంభించనుంది. ఈ నిర్ణయం మంగళవారం సాయంత్రం అధికారికంగా టీటీడీ ప్రకటన విడుదల చేస్తుందని అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం భక్తులకు మరింత సౌకర్యాన్ని కలిగించడంతో పాటు, రద్దీ తగ్గిన సమయంలో దర్శనాలు తీసుకోవడానికి అంగీకరించిన వారికి మరింత అవకాశాన్ని అందించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa