తెదేపా చివరి విడతగా మిగిలిన 36 శాసనసభ స్థానాలతో సహా, మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గానూ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. శాసనసభ అభ్యర్థుల జాబితాను సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో తెదేపా విడుదల చేసింది. తొలి జాబితాపై వచ్చిన స్పందననూ పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పుచేర్పులు చేసింది. లోక్‌సభ స్థానాలకు ఎంపికలనుబట్టి అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపులో ఈ మార్పుచేర్పులు ఉన్నాయి. విజయనగరం, శింగనమల, కదిరి, పోలవరం, కర్నూలు తదితర స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న మీసాల గీత, యామినీబాల, చాంద్‌బాషా, మొడియం శ్రీనివాసరావు, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టిక్కెట్లు ఇవ్వలేదు. వారి స్థానంలో వేరే వారికి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం దక్కింది. ఉండి నియోజకవర్గం నుంచి తొలి జాబితాలో అభ్యర్థిగా ప్రకటించిన వేటుకూరి వెంకట శివరామరాజును నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని తెదేపా నిర్ణయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికే నంద్యాల స్థానం దక్కింది. ఆళ్లగడ్డ నుంచి మంత్రి అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. భూమా కుటుంబంలో ఇద్దరికి సీట్లు దక్కాయి. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ అశోకగజపతిరాజు కుమార్తె అదితి పోటీ చేయనున్నారు.
టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా :
1. శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
2. విజయనగరం – అశోక్ గజపతిరాజు
3. విశాఖపట్నం – భరత్
4. అనకాపల్లి – ఆడారి ఆనంద్
5. అరకు – కిషోర్ చంద్ర దేవ్
6. కాకినాడ – చలమలశెట్టి సునీల్
7. అమలాపురం – గంటి హరీష్
8. రాజమహేంద్రవరం – మాగంటి రూపాదేవి
9. నర్సాపురం – శివరామ రాజు
10. ఏలూరు – మాగంటి బాబు
11. మచిలీపట్నం – కొనకళ్ల నారాయణ
12. విజయవాడ – కేశినేని నాని
13. గుంటూరు – గల్లా జయదేవ్
14. నరసరావుపేట – రాయపాటి సాంబశివరావు
15. బాపట్ల – శ్రీరామ్ మాల్యాద్రి
16. ఒంగోలు – శిద్దా రాఘవరావు
17. నెల్లూరు – బీదా మస్తాన్ రావు
18. కడప – ఆది నారాయణ రెడ్డి
19. రాజంపేట – సత్యప్రభ
20. నంద్యాల – మాండ్ర శివానందరెడ్డి
21. కర్నూలు – కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి
22. అనంతపురం – జేసీ పవన్
23. హిందూపురం – నిమ్మల కిష్టప్ప
24. తిరుపతి – పనబాక లక్ష్మి
25. చిత్తూరు – శివ ప్రసాద్
శాసనసభ అభ్యర్థులు..
1. నెల్లిమర్ల- పతివాడ నారాయణస్వామినాయుడు
2. విజయనగరం- అదితి గజపతిరాజు
3. భీమిలి- సబ్బం హరి
4. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
5. చోడవరం- కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు
6. మాడుగల- గవిరెడ్డి రామానాయుడు
7. పెందుర్తి- బండారు సత్యనారాయణ మూర్తి
8. అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు
9. నిడదవోలు- బూరుగుపల్లి శేషారావు
10. నర్సాపురం- బండారు మాధవనాయుడు
11. పోలవరం- బొరగం శ్రీనివాసరావు
12. తాడికొండ- తెనాలి శ్రావణ్‌కుమార్
13. బాపట్ల- అన్నం సతీష్ ప్రభాకర్
14. నరసరావుపేట- డాక్టర్ అరవింద్ బాబు
15. మాచర్ల- అంజిరెడ్డి
16. దర్శి- కదిరి బాబురావు
17. కనిగిరి- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
18. కావలి- విష్ణువర్ధన్‌రెడ్డి
19. నెల్లూరు- రూరల్ అబ్దుల్ అజీజ్
20. వెంకటగిరి- కె.రామకృష్ణ
21. ఉదయగిరి- బొల్లినేని రామారావు
22. కడప- అమీర్‌బాబు
23. రైల్వేకోడూరు- నర్సింహ ప్రసాద్
24. ప్రొద్దుటూరు- లింగారెడ్డి
25. కర్నూలు- టీజీ భరత్
26. నంద్యాల- భూమా బ్రహ్మానందరెడ్డి
27. కోడుమూరు- బి.రామాంజనేయులు
28. గుంతకల్లు- ఆర్.జితేంద్రగౌడ్
29. శింగనమల- బండారు శ్రావణి
30. అనంతపురం అర్బన్- ప్రభాకర్ చౌదరి
31. కల్యాణదుర్గం- ఉమామహేశ్వరనాయుడు
32. కదిరి- కందికుంట వెంకటప్రసాద్
33. తంబళ్లపల్లె- శంకర్ యాదవ్
34. సత్యవేడు- జేడీ రాజశేఖర్
35. గంగాధరనెల్లూరు- హరికృష్ణ
36. పూతలపట్టు- తెర్లాం పూర్ణం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa