రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి సోమన్న, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేశ్ లు మే 17న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) లో జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జేఎన్‌టీయూ పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa