అనంతపురంలోని క్లబ్‌లో గురువారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ మురళీధర రావు ఆర్ట్స్ కాలేజ్‌ను నేపథ్యంగా చేసుకుని రూపొందించిన లఘు చిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆర్ట్స్ కాలేజ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ లఘు చిత్రం మే 17వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ప్రదర్శించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పద్మశ్రీ, జనసేన పార్టీ నాయకులు భవాని రవికుమార్ తదితర ప్రముఖులు హాజరవుతారు. లఘు చిత్రం విద్యార్థుల మనసుల్లో కళాశాల జ్ఞాపకాలను మెదిలించే విధంగా ఉండనుందని నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa