స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు చేదు వార్త అందించింది. అన్ని కాలపరిమితుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు శుక్రవారం (మే 16, 2025) నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ నిర్ణయంతో, 444 రోజుల డిపాజిట్లపై ఇప్పటివరకు 7.05%గా ఉన్న వడ్డీ రేటు 6.85%కి తగ్గింది. అలాగే, మిగతా అన్ని కాలపరిమితుల డిపాజిట్లపై కూడా వడ్డీ రేటు 0.20% తగ్గనుంది. ఈ తగ్గింపు వల్ల FDలు చేసుకున్న కస్టమర్లకు ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. కస్టమర్లు తమ డిపాజిట్ ప్లాన్‌లను సమీక్షించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు.
![]() |
![]() |