జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభయాన్ పథకం కింద శ్రీ సత్యసాయి జిల్లాలోని మూడు తండాలను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ శుక్రవారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన తండాలు సోమందేపల్లి మండలంలోని నాగి నాయన చెరువు తాండ, తనకల్లు మండలంలోని ముండ్లవారి పల్లి, గాండ్లపెంట మండలంలోని తుమ్మల బైలు తాండాలు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎంపికైన ఈ గ్రామాలలో సమగ్ర అభివృద్ధి కోసం వివిధ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల, సామాజిక-ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు.
![]() |
![]() |