ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో శుక్రవారం జరిగిన ఒక దారుణ రోడ్డు ప్రమాదంలో ఏడు నెలల గర్భిణి మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం, వత్సవాయికి చెందిన సతీష్ తన భార్య రాజేశ్వరి (22)తో కలిసి బైకుపై ప్రయాణిస్తుండగా, లారీతో ఢీకొన్నారు. ప్రమాదవశాత్తు వారు లారీ కింద పడటంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఈ ఘటనతో రాజేశ్వరి కుటుంబంతో పాటు సతీష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa