రాప్తాడు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం ఎంఎల్ఏ పరిటాల సునీత క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిశీలకురాలు శ్రీమతి కృష్ణమ్మ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగత కమిటీల నియామకం, మినీ మహానాడు ఏర్పాట్లు, తిరంగా ర్యాలీ నిర్వహణ వంటి ముఖ్య అంశాలపై సమీక్షించారు. పార్టీ పటిష్ఠత కోసం కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని, కార్యకర్తల చొరవతో పార్టీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, శ్రేణులకే చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]() |
![]() |