గ్రామాలను అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సోమందేపల్లి ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ ఓంకార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రభుత్వ వైద్యశాల వైద్య సిబ్బందితో కలిసి నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ఈ మాటలు అన్నారు.
వైద్యశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ప్రజల ఆరోగ్య రక్షణకు పరిశుభ్రత ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు కలసి శ్రమించడంతో పరిసరాలు మెరుగ్గా మారాయి.
ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో శుద్ధి పరిరక్షణ పట్ల అవగాహనను పెంచుతాయని, ప్రజల భాగస్వామ్యం వల్లే దీర్ఘకాలిక మార్పు సాధ్యమవుతుందని డా. ఓంకార్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa