జేఎన్టీయూ (జవహర్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ)లో శనివారం నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గవర్నర్ నజీర్‌ను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, ఎమ్మెల్యే సింధూర భర్త పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. స్నాతకోత్సవం ఈ సంవత్సరం ప్రత్యేకంగా జరిగిందని, జేఎన్టీయూ యూనివర్శిటీ అభివృద్ధి, విద్యా రంగంలో కీలకంగా నిలవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa