అగళి మండలంలోని పూలపల్లి గ్రామంలో నిర్మించిన గొర్రెల షెడ్‌కు ఆదివారం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. రైతు తిప్పేస్వామి ప్రభుత్వ నిధులతో నిర్మించుకున్న ఈ షెడ్‌ను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. షెడ్ యూనిట్ల నిర్మాణానికి బ్యాంకుల ద్వారా రుణాలతో పాటు సబ్సిడీని కూడా అందిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక రైతులు, గ్రామ పెద్దలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa