ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కదిరి మున్సిపల్ చైర్ పర్సన్‌ ఉపఎన్నిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 11:26 AM

సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపల్ చైర్ పర్సన్‌తోపాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదుర్చేందుకు స్థానిక ఎంఎల్ఏ కందికుంట తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక బెంగళూరు క్యాంపు నుంచి టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి నేరుగా చేరుకోనున్నారు. ఈ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యే అవకాశముందని సమాచారం. మొత్తం 36 వార్డులకుగాను టీడీపీకి 25, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలానే  రామగిరి ఎంపీపీకి సైతం నేడు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీపీ ఎన్నిక గదిలోనూ, కార్యాలయం బయట అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక నేపథ్యంలో రామగిరిలో 144 సెక్షన్‌ను విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa