క్రీడల ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామం నందు పికల్ బాల్ కోర్ట్ ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలుష్యాల కారణంగా మనుషులు అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవనానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు బోడే శ్రీరామ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa