పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీలో ఆడకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి భారత క్రికెట్ బోర్డు సమాచారం ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa