మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాహుల్ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న ఓ కుటుంబంపై కొంతమంది యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ యువతి ముఖంపై ఘోరంగా గాయాలు చేశారు, దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడికి పాత కక్షలు కారణంగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa