AP: గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలంలో దారుణ ఘటన జరిగింది. కానిస్టేబుల్ కె.సురేష్.. ధనలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య కుసుమ నిలదీయడంతో ఆమెను 6 నెలలుగా వేధిస్తున్నాడు. భార్య అడ్డు తొలిగించుకోవాలని భావించిన సురేష్ ఈ నెల 18న ప్రేయసితో కలిసి భార్య కళ్లలో కారంకొట్టి, గొంతులో ట్యాబ్లెట్ల పొడి వేసి హత్యకు యత్నించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa