సింహాచలం అప్పన్న స్వామి ఆలయ ప్రధానార్చక-2 ఐవీ.రమణాచార్యులు (58) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన... కొద్ది రోజుల నుంచి నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన సింహాచలం దేవస్థానంలో1992లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 2020లో ప్రధానార్చక-2గా పదోన్నతి పొందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa