కళ్యాణదుర్గం పట్టణంలోని వెలసిన సాయిబాబా గుడి సమీపంలో సోమవారం ఉదయం ఓ పెద్ద చెట్టు విరిగి విద్యుత్ లైన్ మీద పడింది. ఈ సంఘటనతో పట్టణంలోని 30 శాతం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది.
విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు ప్రారంభించారు. "ఒక అర్ధగంట లోపల విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తాం. వినియోగదారులు సహనంగా ఉండాలని కోరుతున్నాం," అని వారు తెలిపారు.
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అధికారులు చెట్టు తొలగించి విద్యుత్ లైన్లు సరిచేసే పనులు వేగంగా కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa