మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి గెవ్రాయ్ పట్టణానికి సమీపంలోని ధూలే-సోలాపూర్ జాతీయ రహదారి గాంధీ వంతెనపై ట్రక్కు ఢీకొని ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు. వివరాల ప్రకారం.. ముందుగా ఓ ఎస్‌యూవీ వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ వాహనాన్ని డివైడర్ నుంచి తొలగించడానికి ప్రయాణికులు కిందకి దిగగా.. అదే సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు వారిపైకి దూసుకెళ్లింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa