వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు(బుధవారం, మే 28) ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే.. భారీ వర్షాల నేపథ్యంతో పొదిలి పర్యటన వాయిదా పడిందని వైయస్ఆర్‌సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది. కూటమి పాలనలో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైయస్ జగన్ భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa