ఉగ్ర లింకులతో సంబంధం ఉన్న సిరాజ్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ రక్షా సమితి, ఏపీ సాధూ పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో పనిచేస్తోన్న సిరాజ్ తండ్రి, సోదరుడిని విధుల నుంచి తప్పించి, విచారణ జరిపించాలన్నారు. ఆ కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలో పోలీస్ కార్డెన్ సెర్చ్ చేపట్టాలని అన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా మసీదులతో పాటు మదరసాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మాదరసాలకు ఎక్కడెక్కడ నుండో గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారన్నారు. ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణం నెలకొందని చెప్పారు. ఇంత జరిగినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉగ్ర లింకులు కనిపెట్టడంలో పోలీస్ శాఖ వైఫల్యం చెందిందని శ్రీనివాసనంద సరస్వతి విమర్శలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa