ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిఫైండ్ ఆయిల్స్ వాడుతున్నారా, జాగ్రత్త హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయట

Health beauty |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 09:38 PM

కొన్ని రోజుల క్రితం వరకూ సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్, ఇతర రిఫైండ్ ఆయిల్స్ తీసుకుంటే గుండెకి మంచిదని చెబుతుండేవారు. కానీ, ఇప్పుడు కొన్ని అధ్యయనాలు, ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వాపు, గుండె సమస్యలు పెరుగుతాయి. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుందని, ఈ కారణంగా గుండె సమస్యలొచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు. అసలు రిఫైండ్ ఆయిల్స్‌లో ఉండే ప్రమాదకర పదార్థాలు ఏంటి. వీటి బదులు ఏం వాడొచ్చు. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి.

నూనెలు

వంట చేయడానికి నూనెలు అవసరం. ఈ నూనెలతోనే వంటకి రుచి వస్తుందని చెప్పొచ్చు. అయితే, మితిమీరిన వాడకం అస్సలు మంచిది కాదు. తక్కువ మోతాదులోనే వాడాలి. అయితే, ఇదివరకటి రోజుల్లో అయితే పొలాల్లో పండిన పల్లీలు, నువ్వుల్ని గానుగ పట్టించి మన కళ్ళముందే తయారైన నూనెని తీసుకొచ్చి వాడేవారు. కానీ, రాన్రాను అది కష్టంగా మారి ఈజీగా దొరికే రిఫైండ్ ఆయిల్స్‌కి షిఫ్ట్ అయ్యారు. ఇందులో గుండెకి మంచిదంటూ సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ వంటి ఇతర ఆయిల్స్‌ని ఎన్నో వాడడం మొదలుపెట్టారు. కానీ, వీటిని ప్రాసెస్ చేసి తయారుచేసే క్రమంలో ఇందులోని పోషకాలు పోవడమే కాకుండా ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు.

వంటలకి నూనె

ప్రాసెస్డ్ ఆయిల్స్‌లో

ప్రాసెస్డ్ ఆయిల్స్‌లో ఎక్కువగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వాపుని పెంచుతాయి. చాలా రకాల కమర్షియల్ ఆయిల్స్‌ని కెమికల్లీ ప్రాసెస్ చేస్తారు. ఈ టైమ్‌లో వాటిలోని ముఖ్య పోషకాలు తొలగిపోతాయి.

వీటిని మనం ఎక్కువగా వేడిపై వండడం వల్ల ఆహారంలో విషపూరిత సమ్మేళనాలు కలుస్తాయి. వీటి కారణంగానే సమస్యలు వస్తాయి.

రిఫైండ్ ఆయిల్స్‌ తయారీ

ఈ రకంగా తయారుచేసిన సీడ్ ఆయిల్స్‌లో ఎక్కువగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వాపుకి దారితీస్తాయి. ఎక్కువగా ప్రాసెస్ చేసి, అల్ట్రా ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారు. కాబట్టి, వీటిని తీసుకున్నప్పుడు బాడీలో మంట పెరుగుతుంది. కొన్ని సీడ్ ఆయిల్స్‌ ఎక్కువరోజులు ఉండేందుకు ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. సీడ్ ఆయిల్స్‌ని కెమికల్‌గా ప్రాసెస్ చేస్తారు. అందులో క్లీన్ చేయడం, ప్రెస్సింగ్, బ్లీచింగ్, డియోడరైజింగ్, రిఫైనింగ్ చేస్తారు. కొన్నిసార్లు నూనె తీయడానికి కెమికల్ హెక్సేన్‌ని కలుపుతారు. ఇలా ప్రాసెస్ చేసినప్పుడు పోషకాలు తగ్గుతాయి. హానికరమైన పదార్థాలు కలుస్తాయి. దీని కారణంగా నూనెల్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. కాబట్టి, ఈ నూనెల విషయంలో జాగ్రత్త అవసరం. ఇలాంటి నూనెల్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బయట దొరికే స్నాక్స్‌లోనూ వాడతారు.

రిఫైండ్ ఆయిల్స్‌తో వచ్చే సమస్యలు

వీటిని తీసుకున్నప్పుడు శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయి. విత్తనాలతో తయారైన నూనెలో లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఓ రకమైన ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్, పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. మన బాడీకి ఇవి తక్కువ అవసరం. వీటి వల్ల కొలెస్ట్రాల్, గుండె సమస్యల నుండి కాపాడుకోవచ్చు. ఈ రకమైన ఇన్‌బ్యాలెన్స్ బాడీలో వాపుకి దారితీస్తుంది. దీర్ఘకాలికంగా ఇలానే ఉంటే ఆరోగ్య సమస్యలొస్తాయి.

ఆర్థరైటిస్

గుండెజబ్బుస్ట్రోక్టైప్ 2 డయాబెటిస్మెటబాలిక్ సిండ్రోమ్

వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, నూనెల్ని మితంగా వాడితే సమస్య అంతగా ఉండదు. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్‌గా తక్కువగానే తీసుకోవాలి. అప్పుడప్పుడు ఈ ఆయిల్స్‌ని వాడొచ్చు. కానీ, ఎక్కువ టెంపరేచర్‌లో వాడొద్దు. దీని వల్ల సమస్యలు వస్తాయి.

వీటి బదులు

సీడ్ ఆయిల్స్ బదులుగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అవకాడో నూనె వాడొచ్చు. ఇందులో ఎక్కవు మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా శుద్ధి చేయరు. కాబట్టి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కోల్డ్ ప్రెస్డ్ ఆవాల నూనె, నువ్వుల నూనె, కొబ్బరినూనెలు కూడా వాడొచ్చు. అదే విధంగా, నెయ్యి, కొబ్బరినూనె, వెన్న అధిక వేడి వద్ద స్థిరంగా ఉంటాయి. సలాడ్స్, డ్రిజిలింగ్ కోసం ఎక్స్‌ట్రా వర్జిన్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ బెస్ట్.సీడ్ ఆయి‌ని ఫ్రైల కోసం వాడొచ్చు. వంటల్లో వాడితే చాలా తక్కువ వేడితో వండడం, తక్కువ పరిమాణంలో వండడం మంచిది.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa