ఉత్తరాఖండ్‌లో ఓ తండ్రి (డాక్టర్) తన ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటనలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఆ తండ్రికి విధించిన శిక్షను నిలిపివేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
కోర్టు తన తీర్పులో, "తాగిన మైకంలో ఆ తండ్రి తన కన్న కూతురిపై మృగంలా ప్రవర్తించాడు. ఇలాంటి దారుణమైన నేరానికి పాల్పడిన వ్యక్తి ఎలాంటి ఉపశమనం పొందడానికి అర్హుడు కాదు. అతడికి బెయిల్ కూడా మంజూరు చేయలేం" అని స్పష్టంగా పేర్కొంది.
ఈ తీర్పు బాలికల రక్షణ, నేరస్థులకు కఠిన శిక్షల అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తూ, సమాజంలో నీతి, న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేలా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa