హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురం బ్రిడ్జి సమీపంలో నిర్మించిన కొత్త ప్రొటెక్షన్ వాల్ మరియు సీసీ రోడ్డును మునిసిపల్ చైర్‌పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో చెరువు నీరు ఇళ్లలోకి ప్రవేశించి స్థానిక ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, మునిసిపల్ సాధారణ నిధుల ద్వారా రూ. 39.50 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా నిర్మించిన ఈ ప్రొటెక్షన్ వాల్, రహదారి వర్షాకాలంలో ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ఈ అభివృద్ధి పనులు ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో మరో మెట్టు అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa