మహానాడు సందర్భంగా ఎన్టీఆర్‌ను పెట్టి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో విడుదల చేసిన వీడియోపై అనంత వెంకటరామిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ చివరి దశలో చంద్రబాబును ఉద్దేశించి ఏం మాట్లాడారో ఆ వీడియోలు ప్రదర్శించి ఉంటే బాగుండేదని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే గతంలో ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించారని గుర్తు చేశారు. చివరకు ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఆ తర్వాత మళ్లీ ఆయన్ను టీడీపీలోకి ఎప్పుడు చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఈ రోజు ఎన్టీఆర్ భౌతికంగా లేరని, ప్రజలంతా గతాన్ని మరిచిపోయారని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. మోసం చేయడానికి ఎంతకైనా దిగజారవచ్చని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని, చివరకు ఆర్టిఫిషియ్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని కూడా వాడుకున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa