పవిత్ర ఆలయం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం పైనుంచి తాజాగా మరో విమానం అతి తక్కువ ఎత్తులో ప్రయాణించిన ఘటన భక్తుల్లో ఆందోళన కలిగించింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి ఎలాంటి విమాన రాకపోకలు జరగకూడదని స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ, ఈ నిబంధనలు పదేపదే ఉల్లంఘించబడుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గతంలో పలుమార్లు తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఈ విజ్ఞప్తి పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి తరచూ విమానాలు ప్రయాణిస్తుండడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందిస్తూ, ఆలయ పవిత్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని మరోసారి కోరనున్నట్లు తెలిపారు. భక్తులు కూడా తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa