కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లే డోర్ డెలవరీ చేయలేకపోతున్నారు. అలాంటిది వికలాంగులు, వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు తీసుకొచ్చి ఇస్తామంటే నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. అయన మాట్లాడుతూ... ఒకపక్క కొత్తగా 6 వేల రేషన్ షాపులు మంజూరు చేస్తామని చెప్పుకుంటూ, చంద్రబాబు తన ప్రసంగంలో మాత్రం రేషన్‌కి బదులు డీబీటీ ద్వారా డబ్బులిస్తామని చెబుతున్నాడు. ఈ రేషన్ షాపులను ఒక్కోటి రూ.5 లక్షలకు వేలంపాట ద్వారా అమ్మడానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు. అదే జరిగితే ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa