అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకలాపాలు వేగంగా కొనసాగుతున్నాయి. పార్టీ బలోపేతం దిశగా చేపట్టిన చర్యలలో భాగంగా, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి నేతృత్వంలో క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించామని జయరాం రెడ్డి తెలిపారు. పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ కిట్లు పంపిణీ ముఖ్యమైన భాగమని ఆయన పేర్కొన్నారు.
పార్టీ బలోపేతానికి ఇది ఒక కీలకమైన అడుగుగా అభివర్ణిస్తూ, సభ్యత్వ ప్రాసెస్‌ను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa