ధర్మవరం మండల పరిధిలోని రైతులు ఖరీఫ్-2025 సీజన్ కోసం వేరుశనగ విత్తనాలు పొందేందుకు రైతు సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కే-6 మరియు టీసీజీఎస్ 1694 రకాల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఒక రైతుకు గరిష్ఠంగా మూడు బస్తాలు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే విత్తనాలు అందజేయబడతాయని స్పష్టం చేశారు. రైతులు తమ దరఖాస్తులను వెంటనే సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa