ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నటి సంయుక్త ఏలూరు నగరంలో సందడి చేశారు. ఏలూరు నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని నటి సంయుక్తతో కలిసి బాలకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా తన తాజా మూవీ అఖండ 2 తాండవం గురించి బాలకృష్ణ ముచ్చటించారు. మూవీ నిర్మాణం పూర్తి అయిందని, చిత్రం చాలా బాగా వచ్చిందన్నారు. ఇటీవలే టీజర్ విడుదలైందని చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు.కాగా, నటుడు బాలకృష్ణ, నటి సంయుక్తను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa