AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. ఆ పసికందును ప్లాస్టిక్ కవర్‌లో వేసి అడవిలో చెట్టుకొమ్మకు వేలాడదీసి వెళ్ళిపోయింది. వీఆర్‌పురం మండలం కొక్కెరగూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మడివి రత్నరాజు అనే యువకుడు వేటకు వెళ్లగా.. అతనికి పసికందు రోదన వినిపించింది. పసికందును తీసుకుని గ్రామానికి చేరుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa