ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన దశలో టెహ్రాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అణ్వస్ర్తవ్యాప్తి నిరోధక ఒప్పందం(NPT) నుంచి వైదొలిగేందుకు తాము సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై సోమవారం వెల్లడించారు. తమ పార్లమెంట్ ఈ మేరకు బిల్లును సిద్ధం చేస్తోందన్నారు. సామూహిక జనహనన ఆయుధాల తయారీని తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa