ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుట్టు రాలే సమస్యను తగ్గించి చుండ్రుని పోగొట్టే డ్రింక్

Life style |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 12:08 AM

జుట్టు రాలడం. ఇప్పుడిదో పెద్ద సమస్య. ఈ తరం వాళ్లైతే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాల్రా బాబు అని తల పట్టుకుంటున్నారు. బయటకు వెళ్తే విపరీతమైన పొల్యూషన్. ఆ దుమ్ము ధూళి పడి జుట్టు రాలిపోతోంది. ఇక ఆహారపు అలవాట్లు కూడా అంతే ఉంటున్నాయి. హెయిర్ కి అవసరమైన పోషకాలు అందించే ఆహారాన్ని తీసుకోవడం లేదు. అందుకే..వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారిపోతున్నాయి. 30 ఏళ్లు దాటగానే జుట్టు రాలిపోయి క్రమంగా బట్టతల వచ్చేస్తోంది. అమ్మాయిలకూ ఇదే విధంగా జుట్టు రాలిపోతోంది. అందం అంతా పోతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. కానీ..ఎన్ని కండీషనర్లు, షాంపూలు వాడినా సరే సహజంగా వెంట్రుకలకు పోషకాలు అందించడం అవసరం. అలాంటి న్యూట్రియెంట్ డ్రింక్ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ యాంటీ హెయిర్ ఫాల్ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.


యాంటీ హెయిర్ ఫాల్ డ్రింక్


హెయిర్ ఫాల్ కి ఇప్పటికే రకరకాల ప్రొడక్ట్స్ వాడే ఉంటారు. వీటిలో కొన్ని బాగానే పని చేస్తాయి. కానీ..ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం చూపిస్తాయి. కానీ..కురులు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వాటికి న్యూట్రియెంట్స్ అందించాలి. అది కూడా సహజంగానే జరగాలి. అలాంటి నేచురల్ చిట్కా గురించే చాలా డిటైల్డ్ గా చెప్పుకుందాం. యాంటీ హెయిర్ ఫాల్ డ్రింక్ గా చెప్పుకునే ఈ రసంతో హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. పైగా వంటింట్లో రెగ్యులర్ గా వాడే కొన్ని పదార్థాలతోనే ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. స్టైప్ బై స్టెప్ దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


ఈ హెయిర్ ఫాల్ డ్రింక్ తయారు చేసుకోడానికి ముఖ్యంగా కావాల్సింది ఉసిరి కాయలు. వీటితో పాటు అల్లం, కరివేపాకు, మిరియాలు అవసరం అవుతాయి. జీలకర్ర, పసుపు, పెరుగు కూడా అవసరం. వీటన్నింటితో పాటు డ్రింక్ తయారు చేసుకోడానికి కాసిన్ని నీళ్లు కావాలి. ఇవన్నీ అవసరం సరే. కానీ..ఈ పదార్థాలను ఏ మోతాదులో తీసుకోవాలన్నది తెలియాలి. సరైన విధంగా వీటిని తీసుకుంటేనే పర్ ఫెక్ట్ యాంటీ హెయిర్ ఫాల్ డ్రింక్ తయారు చేసుకోగలం. ఈ క్వాంటిటీ ఎలా తీసుకోవాలన్నది కింద ఇచ్చిన వీడియోలో చాలా క్లియర్ గా చెప్పారు. దాన్ని బట్టి ఫాలో అయిపోవచ్చు.


ఎలా తీసుకోవాలి


​ఉసిరి కాయలు మూడు అవసరం అవుతాయి. వీటితో పాటు ఓ చిన్న అల్లం ముక్క, 10-15 కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి. అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 100 మి.లీ. పెరుగు, 100 మి.లీ నీళ్లు కావాలి. వీటితో ఇప్పుడు చెప్పే విధంగా ఈ డ్రింక్ తయారు చేసుకోవాలి. ముందుగా ఉసిరి కాయను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వాటిని మిక్సీ జార్ లో వేయాలి. ఆ తరవాత అందులో కరివేపాకు వేయాలి. తరవాత అల్లం ముక్కలు, మిరియాలు కలపాలి. తరవాత జీలకర్ర, పసుపు వేయాలి. గడ్డ పెరుగు కలపాలి. చివర్లో నీళ్లు పోయాలి. వీటన్నింటినీ కలిపి సరైన విధంగా మిక్సీ పట్టాలి.


తయారీ విధానం


తరవాత ఏం చేయాలి


మిక్సీ పట్టినప్పుడు అది సరైన విధంగా జ్యూస్ లా వచ్చేలా చూసుకోవాలి. ఆ తరవాత ఈ మిశ్రమాన్ని వడబోయాలి. అలా కాసేపట్లోనే యాంటీ హెయిర్ ఫాల్ డ్రింక్ తయారైపోతుంది. అయితే..ఈ డ్రింక్ ని నేరుగా తీసుకోవచ్చు. కానీ..ఇంకాస్త ఎక్కువ ప్రయోజనాలు ఉండాలన్నా,నోటికి రుచి తగలాలన్నా మరొక్క పదార్థం కలుపుకోవాలి. అదే పింక్ సాల్ట్. ఇది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి తీసుకుంటే మరింత లాభాలుంటాయి. పింక్ సాల్ట్ లో సోడియం కంటెంట్ తక్కువగానే ఉంటుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే..చిటికెడు కలుపుకుని తాగితే సరిపోతుంది.


ఎలా వాడితే మంచిది


ఈ యాంటీ హెయిర్ ఫాల్ డ్రింక్ ని ఎప్పుడు తాగితే రెట్టింపు లాభాలుంటాయన్నదీ తెలుసుకోవాలి. ఈ లెక్క ప్రకారం చూస్తే..ఈ డ్రింక్ ని పరగడుపున తాగాలి. అయితే..దీంతో పాటు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఇంకా మంచిది. గోరు వెచ్చని నీళ్లు తాగిన తరవాత ఈ డ్రింక్ తీసుకోవాలి. ఇలా కనీసం రెండు నెలల పాటు రోజూ తీసుకుంటే చాలా త్వరగా హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. జుట్టు తెల్లబడడం, చుండ్రు సహా ఇతరత్రా సమస్యలూ క్రమంగా తగ్గిపోతాయి. జుట్టు కుదుళ్లు బలంగా మారిపోతాయి. హెయిర్ చాలా సిల్కీగా, బౌన్సీగా మారేందుకు అవకాశాలుంటాయి.


ఎలా పని చేస్తుంది


ఇందులో కలిపిన ప్రతి పదార్థం కూడా హెయిర్ గ్రోథ్ ని పెంచేవే. ముఖ్యంగా ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. యాంటీ మైక్రోబయల్ లక్షణాలుండడం వల్ల చుండ్రు సహా ఇతరత్రా ఇన్ ఫెక్షన్స్ ని తగ్గించడంలోనూ ఉసిరికాయలు చాలా బాగా పని చేస్తాయి. కేవలం తాగడం వల్లే కాదు. ఉసిరి రసాన్ని నేరుగా జుట్టుకు పట్టించినా అదే విధంగా పోషకాలు అందుతాయి. ఉసిరి పొడిని నీళ్లలో కలిపి కాస్త పేస్ట్ లా చేసుకుని వారానికి రెండు మూడు సార్లు మర్దన చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు కురులు ఒత్తుగా పెరిగేందుకు అవకాశముంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa