యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జూన్ 21న యోగా దినోత్సవంసందర్భంగా మోదీ సందేశంతో కూడిన లేఖను విడుదల చేశారు. యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం’ అనే థీమ్‌తో ముందుకువెళ్తున్నట్లు చెప్పారు. యోగా ద్వారా మరింత ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం లభిస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa