ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికబరువు, షుగర్, గుండె సమస్యలున్న వారు పంచదార బదులు ఏం తినొచ్చొంటే

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 11:10 PM

పంచదార మాత్రమే తినడం వల్ల సమస్యలు రావు. కొన్ని పదార్థాలలో కూడా పంచదార ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్, సాసెస్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌,సోడాలు, స్వీట్స్ లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది ఫ్రక్టోజ్, మాల్టోజ్ వంటి రకరకాల పేర్లతో ఉంటుంది. వీటిని తినడం వల్ల షుగర్, అధికబరువు, టైప్ 2 డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, దంత సమస్యలు పెరుగుతాయి.


వీటి గురించి తెలిసి కూడా చాలా మంది దీనిని స్కిప్ చేయలేకపోతారు. ఏదో రూపంలో మనం తీసుకుంటూనే ఉంటాం. అయితే, తెలిసితెలిసి హెల్త్‌ని పాడుచేసుకునే బదులు. అసలు ఎన్నో సమస్యలకి కారణమయ్యే షుగర్‌ని ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకోండి.


ఏయే పదార్థాలలో ఉంటాయంటే


సాసెస్ : కెచప్, సలాడ్ డ్రెస్సింగ్స్, బార్బేక్యూ సాసెస్బేకింగ్ ఫుడ్స్, బ్రెడ్సెరియల్స్‌లో కూడా ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఫ్లేవర్డ్ యోగర్ట్, మిల్క్‌లో పంచదార ఉంటుంది. గ్రనోలా బార్స్, ప్రోటీన్ బార్స్, నట్ బటర్స్‌లోకూడా ఉంటుంది. ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్‌లో కూడా పంచదార శాతం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా, ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్వీట్స్‌లో పంచదార శాతం ఎక్కువగా ఉంటుంది.


షుగర్‌ని తగ్గిస్తే


మనం తీసుకునే షుగర్‌ని తగ్గిస్తే హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగ్గా మారుతుంది. ముఖ్యంగా ఆడవారిలో. దీంతోపాటు జీర్ణ సమస్యలు, బ్లోటింగ్, అసిడిటీ వంటి గట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పంచదారని తగ్గిస్తే దూరమవుతాయి. గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి సమయం తెలుగు బాధ్యత వహించదు.​​


స్వీట్స్ బదులు


అదే విధంగా, కేక్స్, పైస్, డోనట్స్, ఐస్‌క్రీమ్స్ వంటి బదులు తాజా పండ్లు, గ్రీక్ యోగర్ట్, దాల్చిన చెక్క, బేక్డ్ ఫ్రూట్ విత్ క్రీమ్, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకోవాలి. వీటితో పాటు కెచప్, సాసెస్, స్వీట్ చిల్లీ సాస్‌ల బదులు షుగర్ లేని స్పైసెస్, చిల్లీ, మస్టర్డ్, వెనిగర్, పెస్టో, మయోనైజ్, లెమన్ జ్యూస్‌లు తీసుకోవాలి.


ఫుడ్ లేబుల్స్


మనం ఏదైనా తీసుకునేటప్పుడు ముందుగా ఫుడ్ లేబుల్స్ చెక్ చేయాలి. పంచదార బదులు లో షుగర్ ఆల్టర్నేటివ్ష్ అయిన స్టీవియా, మాంక్ ఫ్రూట్ వంటి వాటితో తయారైన ఫుడ్స్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి. అలా కాకుండా ప్రాసెస్డ్ లేకుండా నేచురల్‌గానే తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్ తీసుకోవాలి.


పంచదార బదులు


బెల్లం, తేనె, తాజా పండ్లు పంచదార బదులు తీసుకోవచ్చు. షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇవి బెస్ట్ ఆప్షన్. కానీ, మంచివే అయినప్పటికీ ఎక్కువగా తీసుకోపవడమే మంచిది. వీటి వల్ల కూడా షుగర్ లెవల్స్ పెరిగే చాన్స్ ఉంది కాబట్టి, తక్కువగా తీసుకోవాలి. దీంతో బరువు తగ్గుతారు, షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.


బెస్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం


హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, ప్రజెంట్ చాలా రకాల ఫుడ్స్‌లో పంచదార ఉంటుంది. కాబట్టి, వాటి బదులు మంచి హెల్దీ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని తీసుకోవాలి. పాస్తా సాసెస్, గ్రనోలా బార్స్, బ్రేక్‌‌ఫాస్ట్ సెరియల్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్ బదులు తక్కువ పంచదార ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. హోల్ గ్రెయిన్ బ్రెడ్, ప్రోటీన్ డ్రింక్స్ తీసుకోవాలి. ఇలాంటి వాటి వల్ల కడుపు నిండినట్లుగా ఉంటుంది. పైగా ఎక్కువగా షుగర్ డ్రింక్స్ తీసుకోరు. షుగర్ డ్రింక్స్ బదులు నీరు, హెర్ల్ టీలు, అన్‌స్వీటెన్డ్ వాటర్, బ్లాక్ ఆర్ గ్రీన్ టీ, కాఫీ వంటివి తీసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa