ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికార పార్టీ అరాచకాలకు అంతులేకుండా పోతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 08:39 AM

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో లా అండ్‌ ఆర్డర్‌ విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌ మండిపడ్డారు. కుప్పంలో  ప‌చ్చ మాఫియా దౌర్జ‌న్యానికి అంతు లేకుండా పోయింద‌ని, అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  కుప్పం మండలం నారాయ­ణపురంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘ‌ట‌న‌ను భ‌ర‌త్ తీవ్రంగా ఖండించారు.  సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన సీఎం ఇలాకాలో చోటు చేసుకోవ‌డం సిగ్గుచేటు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ వీడియో సందేశం సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa