ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీజీహెచ్ఎస్‌ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. 'హెల్త్ స్కీమ్‌'లో కీలక మార్పులు

business |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 08:35 PM

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) పూర్తిగా డిజిటల్, మరింత పారదర్శకంగా చేసేందుకు కేంద్రం చాలా మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త HMIS పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా లబ్ధిదారులు అపాయింట్‌మెంట్ బుకింగ్, ఇ-కార్డ్ డౌన్‌లోడ్ సహా వైద్య సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. ఈ సంస్కరణలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. కొత్త మార్గదర్శకాలు వైద్య పరికరాల ఆమోదం ప్రక్రియను ఆన్‌లైన్‌లో, ప్రత్యేకమైన పాన్-ఆధారిత ఐడీ, చెల్లింపు ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా చేస్తాయి. ఇది ఆరోగ్య పథకం సేవలను గతంలో కంటే సరళంగా, సురక్షితంగా, మరింత విశ్వసనీయంగా చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.


ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల హెల్త్ స్కీమ్ కోసం సరికొత్త HMIS (హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పోర్టల్‌ www.cghs.mohfw.gov.in ప్రారంభించింది. దీంతో పాటు, వినియోగదారులకు అనుకూలమైన మొబైల్ యాప్‌ తీసుకొచ్చింది. తద్వారా అపాయింట్‌మెంట్ బుకింగ్, ఇ-కార్డ్ డౌన్‌లోడ్, మొబైల్ నుంచే రిపోర్ట్స్ పొందడం వంటి కీలకమైన సేవలు పొందవచ్చు. ఇకపై రిటైర్డ్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో క్యూలో నిలబడవలసిన అవసరం లేదని, వారు మొబైల్‌ నుంచే డిజిటల్‌ సేవలు పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.


ప్రతి లబ్ధిదారునికి ఆధార్ మాదిరిగా పాన్ నంబర్ లింక్ అయిన ప్రత్యేక CGHS ఐడీ కార్డును పొందుతారు. ఇది హెల్త్ స్కీమ్‌లో జరుగుతోన్న మోసాలను అరికడుతుంది, అలాగే రికార్డులు ఒకే చోట ఉండేలా చేస్తుంది. గతంలో లబ్ధిదారులు ప్రతిసారీ తమ సీజీహెచ్ఎస్ కార్డ్‌ను పునరుద్ధరించేందుకు పాత రికార్డులను చూపించాల్సి వచ్చేది. ఇప్పుడు, ఒకే ప్రత్యేక IDతో, మొత్తం కుటుంబ రికార్డులను ఒకే క్లిక్‌తో యాక్సెస్ చేయవచ్చు.


పాత భారత్‌ కోష్ పోర్టల్‌ను మూసివేశారు. ఇప్పుడు CGHS కంట్రిబ్యూషన్ లేదా పునరుద్ధరణ రుసుములను కొత్త HMIS పోర్టల్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్లు వెంటనే ధ్రువీకరిస్తారు. పేమెంట్ రసీదుతో సీజీహెచ్ఎస్ కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. వాపసు సమస్య లేదు, ఆలస్యం ఉండదు ప్రతిదీ వెంటనే పూర్తవుతుంది. గతంలో, లైఫ్ సేవింగ్ కిట్స్ పొందడానికి, డాక్యుమెంట్లను చాలాసార్లు సమర్పించి, ఆమోదం కోసం వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరికరాలన్నింటికీ ఆన్‌లైన్ దరఖాస్తు, ఆమోదం సౌకర్యం తీసుకొచ్చింది.


రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న CGHS కార్డ్‌హోల్డర్‌లు ఇప్పుడు 20 రోజులకు బదులుగా ఐదు రోజుల్లోనే BiPAP కోసం ఆమోదం పొందవచ్చు. అది కూడా వారి ఇంటి ధ్రువీకరణ స్టేటస్ గురించి మొబైల్ ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా పొందవచ్చు. CGHS ఇకపై 'ప్రభుత్వ పథకం' కాదు, 'డిజిటల్ హెల్త్ పార్టనర్' అని కేంద్రం పేర్కొంది. CGHS లబ్ధిదారులు, ఇప్పుడు కొత్త పోర్టల్‌కు లాగిన్ చేసి, పాన్‌కార్డుతో లింక్ చేసుకోవాలని, మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa