ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మనుషులు వావి వరసలు మరిచి మరీ ఎదుటివారిపై మనసు పారేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా వారితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ.. పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇలా చేసుకున్నా ఓకే కానీ.. అప్పటికే పెళ్లై, అందులోనే వయసులోని విపరీతమైన తేడా ఉన్న వారిని, వరుస కాని వారిని కూడా వివాహం చేసుకుంటూ.. కుటుంబ సభ్యులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. ఎంతో ఆశగా కొడుకు పెళ్లికి సన్నాహాలు చేస్తున్న ఓ తండ్రి, చివరకు తానే కాబోయే కోడలిని పెళ్లాడటంతో కుటుంబంలో తీవ్ర విషాదం, ఆందోళన నెలకొంది. ఈ ఊహించని పరిణామం ఉత్తర ప్రదేశ్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగుచూడగా.. దాన్ని అడ్డుకున్న భార్యాబిడ్డలపై ఆ వ్యక్తి దాడికి తెగబడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. బంధాల పవిత్రతను ప్రశ్నిస్తున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర ప్రదేశ్‌లోని జోధ్‌పూర్‌లో షకీల్ అనే వ్యక్తి తన 15 ఏళ్ల మైనర్ కొడుకుకు పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లీడుకు రాకపోయినా సరే అతడికి వివాహం జరిపించాలనుకున్నాడు. అందుకు భార్య, కుమారుడిని కూడా ఒప్పంచి మరీ ఓ సంబంధం కుదిర్చాడు. అంతా సవ్యంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో.. షకీల్ తన కొడుకుకు కాబోయే భార్యతో ప్రేమలో పడిపోయాడు. తరచుగా ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూ వచ్చాడు. ఆమెకు కూడా కాబోయే భర్త కంటే మామే ఎక్కువ నచ్చగా అతడితోనే ప్రేమాయణం సాగించింది. ముందుగా మాటలతోనే ప్రారంభమైన వీరి ప్రయాణం ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అయితే షకీల్ భార్య షబానాకు ఈ విషయంపై అనుమానం రాగా.. వారిపై ఓ కన్నేసింది. ఇలా ఓ రెండు సార్లు వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అయితే పరువు పోతుందని భావించిన ఆమె ఎవరికీ చెప్పకుండానే భర్తను మార్చుకోవడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే ఈ చేదు నిజం కొడుక్కు తెలియగా.. అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. కన్నతండ్రే తన జీవితాన్ని నాశనం చేశాడని కన్నీరుమున్నీరుగా విలపించాడు. అమ్మాయి పోతే పోయింది కానీ ఇకనైనా తీరు మార్చుకుని తమతో చక్కగా ఉండమని షబానా, కుమారుడు.. షకీల్‌కు నచ్చజెప్పారు. కానీ అతడు మాత్రం వారి మాట వినలేదు.
దీంతో వారు బంధువులు, స్నేహితులకు విషయం చెప్పి అతడి మార్చాలనుకున్నారు. ఇందుకోసం ప్రయత్నాలు కూడా చేశారు. ఎవరెంత చెప్పినా షకీల్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పైగా ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం తీసుకొని తన కొడుకుకు కాబోయే భార్యతో వెళ్లిపోయాడు. వివాహం కూడా చేసుకున్నాడు. ఈ చర్యతో కుటుంబం కుమిలిపోయింది. భర్త చేసిన మోసం, ద్రోహం షబానాను తీవ్రంగా కలచివేసింది. ఆమె ఈ అక్రమ సంబంధాన్ని, పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించింది. కొడుకు కూడా తండ్రి చర్యను అంగీకరించలేకపోయాడు.
ఈ దారుణమైన పెళ్లిని వ్యతిరేకించినందుకు షకీల్ తన సొంత భార్య షబానాపై, కొడుకుపై దాడికి తెగబడ్డాడు. వారిని తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటన కుటుంబంలో మరింత చీలికను తీసుకువచ్చింది. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కాదని కాబోయే కోడలిని పెళ్లాడటం, అడ్డు చెప్పినందుకు వారిపై దాడి చేయడం షకీల్ ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ బంధాలు, నమ్మకాలపై షకీల్ చేసిన ఈ దాడి సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa