ఈ రోజుల్లో చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. చికెన్ ప్రియులకు వారాలు, రోజులతో పట్టింపు లేదు. దొరికిదంటే ఒక పట్టు పట్టేస్తారు. ఇక, చాలా మంది స్కిన్‌తో పాటే చికెన్ తింటుంటారు. చికెన్ స్కిన్ గురించి ప్రజల్లో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని ఆరోగ్యానికి హానికరం అని భావిస్తే, మరికొందరు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. చికెన్ స్కిన్ అనేది కోడి మాంసంపై ఉండే పై చర్మ పొర. ఇది రుచిగా, కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని ఇష్టపడతారు. దీనిలో ప్రధానంగా కొవ్వు ఉంటుంది. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు స్కిన్‌తో పాటు చికెన్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు
ఈ రోజుల్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ గుండెకు ముప్పు కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చికెన్ స్కిన్‌కు దూరంగా ఉండాలి. చికెన్ చర్మంలో సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని పెంచుతాయి. గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి, ఈ సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ తీసుకోవడం తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఇలాంటి వారు చికెన్ చర్మాన్ని పొరపాటున కూడా తినకూడదంటున్నారు.
గుండె జబ్బులు ఉన్నవారు
సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు ధమనులలో ప్లేక్ ఏర్పడటానికి కారణమవుతాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. చికెన్ స్కిన్ ఈ కోవకే చెందింది. గుండె ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు ఉన్నవారు చికెన్ చర్మాన్ని నివారించాలని నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తపోటు ఉన్నవారు
ఈ రోజుల్లో చాలా మంది హై బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు గుండె గోడలపై ఒత్తిడి తెస్తుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి వారు చికెన్ స్కిన్ అవాయిడ్ చేయాలి. అధిక రక్తపోటు ఉన్నవారు సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ తీసుకోవడం తగ్గించుకోవాలని తరచుగా సిఫార్సు చేయబడుతుంది. చికెన్ చర్మం దీనికి దోహదపడుతుంది. అందుకే చికెన్ స్కిన్ పరిమితం చేయాలి.
బరువు తగ్గాలనుకునేవారు
చికెన్ చర్మంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకోవాలి. చర్మం లేని చికెన్ బ్రెస్ట్ తో పోలిస్తే, చర్మంతో ఉన్న చికెన్ బ్రెస్ట్ లో కేలరీలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, ఒక కప్పు చర్మం లేని ఉడికించిన చికెన్ బ్రెస్ట్ లో 231 కేలరీలు ఉంటే, చర్మంతో ఉన్నదానిలో 276 క్యాలరీలు ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు చికెన్ స్కిన్ జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
గాయాలు ఉన్నవారు
గాయాలు మానడం ప్రారంభించే దశలో చికెన్ చర్మం తినడం వల్ల దురద పెరిగి, మచ్చలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతారు. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారం తక్కువ. అయినప్పటికీ, కొంతమంది దీనిని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయాలు ముఖ్యం
* చికెన్ చర్మాన్ని డీప్‌గా ఫ్రై చేయించడం వల్ల దానిలో కొవ్వు, కేలరీల శాతం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే చికెన్ స్కిన్ ఎక్కువ నూనెను పీల్చుకుంటుంది.
* ఫ్రై చేసిన చికెన్ చర్మం చాలా డేంజర్. ఎందుకంటే ఇది ట్రాన్స్ ఫ్యాట్స్, ఇతర హానికరమైన సమ్మేళనాలను కలిగి ఉండవచ్చు.
* చికెన్ ఫ్రై చేసుకుని తినాలనుకునేవారు స్కిన్ తీసివేయడమే మంచిదంటునన్నారు నిపుణులు.
* చివరగా ఆహారంలో చికెన్ చర్మాన్ని చేర్చుకోవాలా వద్దా అనే దానిపై మీకు ఏవైనా ఆరోగ్యపరమైన ఆందోళనలు ఉంటే.. డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa