పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులకు పార్టీ పంచాయతీరాజ్ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa