మాజీ సీఎం వైయస్ జగన్‌కు నిబంధనల మేరకు భద్రతను కల్పించడంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదంను దురుద్దేశంతోనే వైయస్ జగన్‌కు ఆపాదించేందుకు ఈ ప్రభుత్వం తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే వైయస్ జగన్ కాన్వాయికి ముందు పోలీస్ ఎస్కార్ట్, రోప్ పార్టీని ఏర్పాటు చేయలేదని అంగీకరిస్తారా? భద్రత విషయంలో పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించామని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa