టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకు రింకూ బిజీ షెడ్యూల్ కారణమని క్రీడావర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది నవంబర్ 19న ఎంపీ ప్రియా సరోజ్‌తో వివాహం కావాల్సి ఉంది. అయితే నవంబర్ 14 నుంచి డిసెంబర్19 వరకు భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ క్రమంలోనే పెళ్లిని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa