చిలకలూరిపేట పట్టణ నూతన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఎన్. గోపాల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాజీ మంత్రి , నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధ్యతగా పనిచేసి చిలకలూరిపేటకు మంచి పేరు తేవాలని వెహికల్ ఇన్స్పెక్టర్ గోపాల్ కు సూచించారు. పలువురు సిబ్బంది గోపాల్ ను అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa