జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత శేఖర్ బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఏ.ఎన్.ఎస్. ప్రసాద్ తీవ్రంగా స్పందించారు.పవన్ కల్యాణ్ చెన్నై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలవగలరా? అని శేఖర్ బాబు ప్రశ్నించడాన్ని ప్రసాద్ తప్పుబట్టారు. పవన్ పోటీ చేయనవసరంలేదు... కొళత్తూరు నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తే చాలు... అక్కడ డీఎంకే ఆధిపత్యానికి ముగింపు పలకడంలో ఆ ప్రచారం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ప్రసాద్ అన్నారు. ముందుగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ గెలుపుపై దృష్టి సారించాలని శేఖర్ బాబుకు ఆయన సవాల్ విసిరారు.గతాన్ని గుర్తుచేస్తూ, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.కే. స్టాలిన్ కొళత్తూరులో కేవలం 2,734 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారని ప్రసాద్ గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో స్టాలిన్‌కు 68,677 ఓట్లు (48.35 శాతం) రాగా, ఏఐఏడీఎంకే అభ్యర్థి సైదై దురైస్వామికి 65,943 ఓట్లు (46.43 శాతం) వచ్చాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని శేఖర్ బాబు మరచిపోయారని ఎద్దేవా చేశారు. డీఎంకే ప్రజాదరణ తగ్గుతుంటే, శేఖర్ బాబు ఇలాంటి సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa