ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖంపై ఓపెన్ పోర్స్ ,,,, ఇప్పుడు చెప్పే ప్యాక్స్ వేయండి

Life style |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 10:47 PM

ఓపెన్ పోర్స్.. ఇవి చర్మంపై ఉండే రంధ్రాలు. సాధారణంగా అందరికీ చర్మంపై రంధ్రాలు ఉంటాయి. కానీ, ఎక్కువగా పెద్దగా ఉన్నప్పుడే అసలు సమస్య. వీటిని నేచురల్‌గా తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోండి.


ఓపెన్ పోర్స్‌తో


​ఓపెన్ పోర్స్ ఉంటే స్కిన్ డల్‌గా, అన్ ఈవెన్‌గా ఉంటుంది. అయితే, వీటిని ట్రీట్‌మెంట్‌తో తొలగించుకోవడం కష్టమే. అలా కాకుండా నేచురల్‌గానే కొన్ని ఫేస్‌ప్యాక్స్‌తో దూరం చేయొచ్చు. ఆ ఫేస్‌ప్యాక్స్ వాడడం వల్ల ఓపెన్ పోర్స్ చిన్నగా మారతాయి. స్కిన్ స్మూత్‌గా మారుతుంది. అందుకోసం టాప్ ఫేస్‌ప్యాక్స్ ఏమున్నాయో తెలుసుకోండి.


అలోవెరా జెల్, దోస


2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌లో 2 టేబుల్ స్పూన్ దోసరసాన్ని కలపాలి. బాగా మిక్ష్ చేసి తర్వాత ముఖానికి రాయాలి. దీనిని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో కడగండి. అలోవెరా స్కిన్‌ని సాఫ్ట్‌గా మార్చి హైడ్రేట్‌గా చేస్తుంది. దోస రసం ముఖంపై సమస్యల్ని దూరం చేసి పోర్స్‌ని తగ్గించి స్కిన్‌ని రీఫ్రెష్ చేస్తుంది.


ఓట్స్, పెరుగు


2 టేబుల్ స్పూన్ల ఓట్స్‌లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. బాగా మిక్స్ చేసి పేస్టులా మార్చాలి. దీనిని ముఖానికి రాసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ఓట్స్‌లో ఎక్స్‌ఫోలియేట్ గుణాలు ఉన్నాయి. దీని వల్ల డెడ్ స్కిన్ సెల్స్, ఇంప్యూరిటీస్‌ని దూరం చేస్తాయి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ పోర్స్‌ని టైట్ చేసి స్కిన్‌ని సాఫ్ట్‌గా మారుస్తాయి.


తేనె, నిమ్మరసం


2 టేబుల్ స్పూన్ల తేనెలో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి దానిని ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేస్తాయి. నిమ్మరసం ఓపెన్‌పోర్స్‌ని తగ్గించి స్కిన్‌ని బ్రైట్‌గా మారుస్తాయి.


టమాటతో


బాగా పండిన ఓ టమాటని తీసుకోవాలి. దీనిని మెత్తని గుజ్జులా చేయాలి. ఈ పేస్టుని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. టమాటల్లోని లైకోపీన్, ఆస్ట్రింజెంట్ గుణాలు పోర్స్‌ని తగ్గిస్తాయి. ఎక్కువగా ఆయిల్ రావడాన్ని కంట్రోల్ చేస్తాయి.


ఎగ్ వైట్, నిమ్మరసంతో


1 ఎగ్ వైట్‌లో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. మొత్తం నురగలా కావాలి. అప్పుడే నిమ్మరసం కలిసినట్లు. దీనిని ముఖానికి రాయాలి. ముఖ్యంగా సమస్య ఉన్న చోట రాసి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడగాలి. ఎగ్ వైట్ స్కిన్‌పై ఉన్న పోర్స్‌ని టైట్ చేస్తుంది. నిమ్మలోని విటమిన్ సి స్కిన్‌ని బ్రైటెన్ చేస్తుంది.


ముల్తానీ మట్టి


ముల్తానీ మట్టితో ఫేస్‌ప్యాక్ వేసేందుకు ముందుగా 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టీని 1 టేబుల్ స్పూన్ రోజ్‌వాటర్‌తో కలపాలి. స్మూత్‌పేస్టులా చేయాలి. దీనిని ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ముల్తానీ మట్టిలో నూనెని గ్రహించే గుణాలు ఉన్నాయి. దీని వల్ల జిడ్డుదనం తగ్గుతుంది. స్కిన్ టైట్ అవుతుంది. పోర్స్ అన్‌క్లాగ్ అవుతాయి. రోజ్ వాటర్ స్కిన్‌ని సాఫ్ట్‌గా చేసి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది.


బొప్పాయి, తేనె ప్యాక్


అరకప్పు బొప్పాయి గుజ్జులో 1 టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. దీనిని ప్యాక్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. బొప్పాయిలోని ఎంజైమ్స్ స్కిన్‌ని ఎక్స్‌ఫోలియేట్ చేసి క్లీన్‌గా మారుస్తాయి. తేనెలోని మాయిశ్చరైజింగ్‌ గుణాలు పోర్స్‌ని టైట్‌గా మారుస్తాయి. ​గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి సమయం తెలుగు బాధ్యత వహించదు.​​​​






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa