కడప జిల్లా కమలాపురం మండలం కొప్పోలులో చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 360 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాన్ని స్థాపించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిస్తూ ఇంధన శాఖ ఉత్తర్వు జారీ చేసింది. అలాగే కడప జిల్లా గండికోట వద్ద అదానీ సంస్థ చేపట్టదలచిన 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం సామర్థ్యాన్ని 1,800 మెగావాట్లకు పెంచేందుకూ సమ్మతిస్తూ ఆదేశాలిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa