ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలం తుంసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు తుంసిలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.అనంతరం పలు పరిశ్రమల యాజమాన్యాలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలిస్తారు. బహిరంగ సభ అనంతరం సాయంత్రం 4:30 గంటలకు శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లికి చేరుకొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి వివరించనున్నారు. సాయంత్రం 7:05 గంటలకు కుప్పలోని తన నివాసానికి చేరుకొని రాత్రి బస చేస్తారు. రేపు (గురువారం) ఉదయం 10:30 గంటలకు కుప్పం ఏరియా హాస్పిటల్‌కి చేరుకొని టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు ముఖ్యమంత్రి స్వగృహానికి చేరుకొని అధికారిక సమీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్ని ముగించుకొని సాయంత్రం 4:10 గంటలకు తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కి చేరుకుని.. అక్కడి నుంచి బెంగళూరుకి సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa