బుడమేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బుడమేరు వరద మళ్లింపు కాల్వ (బీడీసీ) ఎడమ కాల్వకట్టపై వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి 3.85 కిలోమీటర్ల నుంచి 4.2 కిలోమీటర్ల వరకు సుమారు 365 మీటర్ల మేర ఈ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించిన రెండు నెలల్లో పూర్తి చేసారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ అనేక అవరోధాలను అధిగమిస్తూ ఎట్టకేలకు పూర్తిచేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనులపై శ్రద్ధచూపి త్వరగా పూర్తయ్యేలా చూశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa