కర్ణాటకలోని బెళగావి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ప్రేమ జంట ఆటో రిక్షాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోకాక్ తాలూకులోని చిక్కనంది గ్రామంలో జులై 1, 2025న ఈ ఘటన జరిగింది. ఊరి బయట ఆటోలో వీరు విగతజీవులై ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న వీరి కల కుటుంబ సభ్యుల అడ్డంకుల వల్ల నెరవేరలేదు. రంజిత తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతో ఈ జంట తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోందi. ఈ నేపథ్యంలో వారు ఆటోలో నేను బిగించి ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక సమాచారం. స్థానిక పోలీసులు ఈ ఘటనపై ఆత్మహత్య, హత్య కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమ వివాహాలపై కుటుంబ సామాజిక ఒత్తిడులు యువత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న చర్చకు ఈ ఘటన దారితీసింది. పోలీసులు మరిన్ని వివరాల కోసం ఈ జంట సన్నిహితులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఈ విషాదం యువతలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సమాజంలో అవగాహన, మద్దతు అవసరాన్ని మరోసారి గుర్తు చేసింద.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa